నీలిమేఘములలో ధరణీ తేజం
నయనాంతరంగములలో వనధీ నాదం పోరునే గెలుచు పార్థివీపతి సాటిలేని ఘనుడైనా నీరజాక్షి అలిగే వేళ నుడివిల్లు ముడి వంచగలడా? సడే చాలు శత సైన్యాలు నడిపే ధీరుడైనా వసుధా వాణి మిథిలా వేణి మదివెనుక పలుకు పలుకులెఱుగ గలడా? నీలిమేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం జలధి జలముల్ని లాలించు మేఘమే వాన చినుకు మార్గమును లిఖించదే స్వయంవరం అనేది ఓ మాయే స్వయాన కోరు వీలు లేదాయె మనస్సులే ముడేయు వేళాయె శివాస్త్ర ధారణేల కొలతాయే వరంధాముడే వాడే పరం ఏలు పసివాడే స్వరం లాగ మారాడే స్వయం లాలి పాడాడే భాస్కరాభరణ కారుణీగుణ శౌరి శ్రీకరుడు వాడే అవనిసూన అనుశోకాన స్థిమితాన తానుండ లేడే శరాఘాతమైనా గాని తొణికేవాడు కాడే సిరి సేవించి సరి లాలించి కుశలములు నిలుప ఘనము నొదిలి కదిలే తేలె మేఘములలో ధరణీ తేజం నయనాంతరంగములలో వనధీ నాదం
No comments:
Post a Comment