తారలైనా చేరాలంటే వేలదూరాలే
అరుణధార ఏరుల్లోన చేరి తీరాలే
తారుమారు చేయాలంటే తీరుమారాలే తరముగాని దారుల్లోనూ ఆరితేరాలే ఒకసారి చూడు మరుసారి చూడు కనిపించకుంటే ... కనుమూసి చూడు నిశితంగ నువ్వు గమనిస్తే...అర్థాలే మారులే తారలైనా చేరాలంటే వేలదూరాలే అరుణధార ఏరుల్లోన చేరి తీరాలే చరణం-1: చీకటంటూ లేని...ఒకరోజు ఉంటే గానీ చిరు చీకటెంత హాయో...మనకర్థమౌతుందోయి x2 అరె అంకెలే చేరి...ఓ సంఖ్యలా మారే సమయాన శూన్యమే సదా..విలువైన వారథే కదా...! తారలైనా చేరాలంటే వేలదూరాలే అరుణధార ఏరుల్లోన చేరి తీరాలే తారుమారు చేయాలంటే తీరుమారాలే తరముగాని దారుల్లోనూ ఆరితేరాలే చరణం-2: ఓ బంధమే చిగురించగా పతి వేలు పట్టి నిలిచేను తనే పెంచిన తనవారినే వదిలి కదిలే ఊపిరే పోయాలని తన తనువు మొరను వినదే తానే ఊపిరే వసివాఱినా అరె ఏ చింతా మరి లేకున్నచో అనుబంధాలే అందేనా? పడలేవా...? పడి లేవా? అరె ఆది అంతము నీ చెంతనే వెనువెంటే ఉంటాయే కనలేవా? నువ్ కాదంటావా? ఆవలి అంచునే బదులున్నా, ప్రశ్నలు లేనిదే దొరికేనా? శోధించే గుణమేగా ప్రధానం వేధించే వరమే జీవితం శూన్యంలా నిలిచే నీ స్వభావం విశ్వాన్నే మలిచే మూలకం శోధించే గుణమేగా ప్రధానం వేధించే వరమే జీవితం శూన్యంతో మొదలయ్యే ప్రయాణం పూర్ణంగా ముగిసే నాటకం